: భారత సినీ చరిత్రలో కొత్త అధ్యాయం... 'కబాలి' కోసం థియేటర్లుగా మారుతున్న స్టార్ హోటళ్లు!

రజనీకాంత్ తాజా చిత్రం 'కబాలి' ఫీవర్ పీక్ ను తాకుతోంది. ఈ చిత్రం 22వ తేదీన విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తమిళనాడు వ్యాప్తంగా ఆన్ లైన్లో అందుబాటులో ఉంచిన టికెట్లన్నీ అమ్ముడు కాగా, చిత్ర నిర్మాతలు భారత చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేపారు. ఈ చిత్రాన్ని స్టార్ హోటళ్లలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్టార్ హోటళ్లలోని కాన్ఫరెన్స్ హాల్స్ ను థియేటర్లుగా మారుస్తున్నారు. కనీసం 300 మంది చూసేలా భారీ తెరలను, సౌండ్ సిస్టమ్స్ ను ఏర్పాటు చేసుకుని రోజుకు నాలుగు ఆటలు ప్రదర్శించేందుకు శరవేగంగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్టు లహరి మ్యూజిక్ డైరెక్టర్ ఆనంద్ తెలిపారు. బెంగళూరులోని విటల్ మాల్యా రోడ్డులోని జేడబ్ల్యూ మారియట్, యహలంక లోని రాయల్ ఆర్చిడ్, లలిత్ అశోక్, ఎలక్ట్రానిక్ సిటీలోని క్రౌన్ ప్లాజా స్టార్ హోటళ్లలో శుక్ర, శని, ఆదివారాల్లో ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. ఇదే జరిగితే స్టార్ హోటళ్లలో విడుదలైన తొలి చిత్రంగా 'కబాలి' నిలుస్తుంది.

More Telugu News