ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

11 ఏళ్లకే ఆన్ లైన్ పోర్న్, 'హార్డ్ కోర్' తో పెరుగుతున్న అత్యాచారాలు!

Sun, Jul 17, 2016, 08:19 AM
ఆన్ లైన్లో కుప్పలు తెప్పలుగా పెరుగుతున్న అశ్లీల చిత్రాలు యువతపై విషం చిమ్ముతున్నాయి. ఓ అధ్యయన సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం, 11 ఏళ్ల సగటు వయసులోనే పోర్నోగ్రఫీకి పిల్లలు అలవాటవుతున్నారు. ఒక్క అమెరికాలోనే సాలీనా పోర్న్ రెవెన్యూ రూ. 1000 కోట్లను దాటిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వారానికి ఒకసారైనా అశ్లీల చిత్రాలను చూస్తున్న వారి సంఖ్య 1.1 కోట్లుగా ఉండగా, వీటి ప్రభావంతో డ్రగ్స్ కు బానిసలవుతున్న వారి సంఖ్య పెరుగుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అశ్లీల సైట్లకు బానిసలుగా మారి, ఆడపిల్లలపై 'హార్డ్ కోర్' దృశ్యాలను చూస్తున్న వారిలో అత్యాచారాలు చేయాలన్న కోరిక పెరుగుతోందని పరిశోధకులు చెబుతున్నారు. విడాకులు తీసుకున్న జంటల్లో 55 శాతం మంది ఆన్ లైన్ పోర్న్ ను ఆశ్రయిస్తున్నారని, వీరికి కలుగుతున్న నీచమైన కోరికలు కూడా రేప్ లు పెరగడానికి కారణమని వెల్లడించారు.
X

Feedback Form

Your IP address: 54.166.48.3
Articles (Latest)
Articles (Education)