: రాజీనామాలకు కళ్లెం వేసేందుకు కంపెనీ వాటాలు ఆఫర్ చేస్తున్న ఇన్ఫీ

ఇన్ఫోసిస్ కంపెనీలో చేరి, ఆపై కొద్ది కాలానికే అనుభవం సంపాదించుకుని సంస్థకు రాజీనామా చేసి వెళ్లిపోతున్న వారిని ఆపేందుకు సంస్థ కీలక నిర్ణయాన్ని వెలువరించింది. జూనియర్, మధ్యస్థాయి ఉద్యోగుల్లో ఈ సమస్య తొలి త్రైమాసికంలో 21 శాతానికి పెరుగగా, వారికి కంపెనీల వాటాలను ఇవ్వాలని నిర్ణయించింది. మార్చి త్రైమాసికంలో 17.3, గత సంవత్సరం క్యూ-1లో 19.2 శాతంగా ఉన్న అట్రిషన్ రేటు గణనీయంగా పెరగడాన్ని సీరియస్ గా తీసుకున్న ఇన్ఫీ యాజమాన్యం, వాటాల ఆఫర్ ను తెరపైకి తీసుకు వచ్చింది. మొత్తం 7,500 మందికి వాటాలను ఆఫర్ చేయనున్నట్టు సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ యూబీ ప్రవీణ్ రావు వెల్లడించారు. పనితీరు ఆధారంగా ఎన్ని వాటాలు ఇవ్వాలన్న విషయాన్ని నిర్ణయిస్తామని తెలిపారు. ఉద్యోగుల పనితీరులో మరింత నాణ్యతను పెంచేలా కొత్త కార్యక్రమాలు చేపట్టనున్నట్టు పేర్కొన్నారు.

More Telugu News