: అత్యంత కిరాతకంగా ట్రక్కు నడిపింది ఫ్రెంచ్ వాసే!

ఫ్రాన్స్ లోని నీస్ లో ట్రక్కుతో దూసుకువచ్చి 85 మంది ప్రాణాలను బలిగొన్న వ్యక్తి ఫ్రెంచ్ వాసేనని, అతని వయసు 31 సంవత్సరాలని అధికారులు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఐడెంటిటీ పేపర్లను ట్రక్కులో కనుగొన్నామని వివరించారు. ఉగ్రవాద వ్యతిరేక విభాగం విచారణ చేపట్టిందని తెలిపారు. దేశంలో మూడు నెలల పాటు ఎమర్జెన్సీని పొడిగిస్తున్నట్టు దాడి అనంతరం అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే వెల్లడించారు. మృతుల్లో చిన్నారుల సంఖ్య అధికంగా ఉండటం తనను కలచివేస్తోందని, గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. దాడి చేసిన వ్యక్తి తనంతట తానుగా దాడికి పాల్పడ్డాడా? లేక అతని వెనుక ఏదైనా ముఠా జరిపిన కుట్ర ఉందా? అన్న కోణంలో ప్రాథమిక విచారణ సాగుతోంది. ఈ దాడికి తామే కారణమని ఇంతవరకూ ఏ ఉగ్రవాద సంస్థా ప్రకటించుకోలేదు.

More Telugu News