: ఉగ్రదాడితో వణికిపోయిన ఫ్రాన్స్!... ఖండించిన అమెరికా అధ్యక్షుడు ఒబామా!

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ సిరియా అండ్ ఇరాక్ (ఐఎస్ఐఎస్) ఫ్రాన్స్ దేశాన్ని బెంబేలెత్తించింది. ఇప్పటికే ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో ఆ దేశ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే లక్ష్యంగా విరుచుకుపడిన ఐఎస్ ఉగ్రవాదులు వంద మందికి పైగా పొట్టనబెట్టుకున్నారు. ఈ దాడితో ఫ్రాన్స్ వణికిపోయింది. ఆ దాడి నుంచి తేరుకోకముందే తాజాగా ఆ దేశంలోని నీస్ నగరంలో వేడుకగా సాగుతున్న బాస్టిల్ వేడుకలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. నిండా పేలుడు పదార్థాలతో నింపిన ట్రక్కుతో వేడుకలపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఈ దాడిలో 75 మంది అక్కడికక్కడే చనిపోగా, మరో వంద మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముందని సమాచారం. ఈ దాడితో భీతిల్లిన ఫ్రాన్స్ శోక సంద్రంలో కూరుకుపోయింది. అధ్యక్షుడు హోలాండే అత్యవసర సమావేశాన్ని నిర్వహించి తాజా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇదిలా ఉంటే... నీస్ నగరంలో జరిగిన దాడిపై అగ్రరాజ్యం అమెరికా వేగంగా స్పందించింది. నీస్ పై ఉగ్రదాడిని ఖండిస్తూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఓ ప్రకటన విడుదల చేశారు.

More Telugu News