: సినిమాలో పనిమనిషికి తన పేరు పెట్టడంపై బాలీవుడ్ నటుడు ఆగ్రహం, ఫిర్యాదు

బాలీవుడ్ లో విడుదలకు ముందే ఇంటర్నెట్ లో లీకైన సినిమా 'గ్రేట్ గ్రాండ్ మస్తీ'పై నటుడు షైనీ అహూజా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సినిమాలో పనిమనిషికి తన పేరు పెట్టారని ఫిర్యాదులో ఆరోపించాడు. ఈ సినిమాలో సోనాలీ రౌత్ పోషించిన పనిమనిషి పాత్రకు షైనీ అని పేరు పెట్టారని, అది తనను ఉద్దేశించి పెట్టినదని, ఈ పాత్ర పేరుతో ఓ పాట కూడా ఉందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు. షైనీ పేరిట ఉన్న సీన్లన్నీ తొలగించాలని ఫిర్యాదులో ఆయన విజ్ఞప్తి చేశాడు. తన పేరును అభ్యంతరకరంగా వాడి, తన పరువుకు భంగం కలిగించారని పేర్కొన్న షైనీ అహూజా, ఈ సినిమా యూనిట్ తనకు లిఖితపూర్వక క్షమాపణ చెప్పాలని ఆ ఫిర్యాదులో డిమాండ్ చేశాడు. దీనిపై నిర్మాతలు, దర్శకుడు, నటులపై చర్యలు తీసుకోవాలని కోరాడు.

More Telugu News