: నిత్యామీనన్ నటించిన ఏ సినిమా అయినా మల్టీ స్టారరే!: హీరో నాని

నిత్యామీనన్ ఏ సినిమాలో హీరోయిన్ గా చేసినా, ఆ సినిమాలో హీరో తనేనంటూ హీరో నాని ప్రశంసించాడు. ‘100 డేస్ ఆఫ్ లవ్’ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న నాని మాట్లాడుతూ, నిత్యామీనన్ నటించిన ఏ సినిమా అయినా మల్టీ స్టారరేనని, త్వరలో తామిద్దరం కలిసి ఒక సినిమాలో నటించాలని వుందని అన్నాడు. ఈ చిత్రం విజయవంతం కావాలని తాను కోరుకుంటున్నానని ‘100 డేస్ ఆఫ్ లవ్’ చిత్రయూనిట్ కు నాని అభినందనలు తెలిపాడు.

More Telugu News