ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

లోపాలు సవరించుకోవడానికి మీడియా గొప్ప సాధనం: హాస్యనటుడు సప్తగిరి

Wed, Jul 13, 2016, 09:12 PM
లోపాలు సవరించుకోవడానికి మీడియా అద్భుతమైన సాధనమని సినీ హాస్య నటుడు సప్తగిరి చెప్పాడు. హైదరాబాదులో ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మీడియా మనలోని లోపాలు ఎత్తి చూపుతుందని అన్నాడు. అయితే ఆ లోపాలను సానుకూల దృక్పథంతో చెబితే మార్చుకుంటామని, మీడియా కావాలని ఎత్తి చూపినప్పుడే సమస్య ఉత్పన్నమవుతుందని అన్నాడు.

తన నటన ఒకే తరహాలో ఉంటుందని మీడియా ఆరోపిస్తుందని, తాను నటనలో అనుభవం సంపాదించుకుని సినిమాల్లోకి రాలేదని, నటనలో ఓనమాలు కూడా తనకు తెలియవని అన్నాడు. ఇప్పుడిప్పుడే నటనలో నడక నేర్చుకుంటున్నానని చెప్పిన సప్తగిరి, మీడియా చేసిన ఆరోపణల్లో వాస్తవం ఉందని అంగీకరించాడు. తన సినిమాలు నాలుగు చూస్తే అందులో వైవిధ్యం ఏమీ కనిపించదని, తాను కూడా దానిని అంగీకరిస్తానని చెప్పాడు. ఇప్పుడిప్పుడే తన నటనావిధానాన్ని మార్చుకుంటున్నానని చెప్పాడు.
X

Feedback Form

Your IP address: 54.211.120.181
Articles (Latest)
Articles (Education)