: సామాజిక మీడియాలో చక్కర్లు కొట్టే ఉద్యోగులు వద్దంటున్న వార్తా సంస్థలు

నిత్యమూ సామాజిక మాధ్యమాల్లో పోస్టింగులు పెడుతూ, అనునిత్యమూ వాటి చుట్టూ తిరిగే ఉద్యోగులు విధి నిర్వహణలో అలసత్వం చూపుతున్నారని, వారిని కొనసాగిస్తే, రిస్క్ లో ఉన్నట్టేనని వార్తా సంస్థలు భావిస్తున్నట్టు సరికొత్త అధ్యయనంలో తేలింది. ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి వెబ్ సైట్లలో తిరిగేవారికి పెద్ద పెద్ద వార్తా సంస్థలు కొన్ని గైడ్ లైన్స్ విధించాయి. కంపెనీలకు సంబంధం లేకుండా, చేస్తున్న పనిని ప్రస్తావించకుండా మాత్రమే సమాచారం పంచుకోవాలని సూచించాయి. ప్రస్తుత సోషల్ మీడియా ట్రెండ్ పై వార్తా సంస్థలు మరింత దృష్టిని సారించాయని, అధ్యయనం చేసిన పెన్సిల్వేనియా, లీహై యూనివర్శిటీ జర్నలిజం ప్రొఫెసర్ జయాన్ లీ వ్యాఖ్యానించారు. అయితే, తమ సొంత ఉద్యోగుల విషయానికి వచ్చేసరికి వార్తా సంస్థల తీరు మారుతోందని, ఇది తనకు ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. సోషల్ మీడియాను విస్తృతంగా వాడే జర్నలిస్టుల నుంచి లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయని ఆమె అన్నారు. అతిగా పోస్టులు పెడుతూ, వాటితోనే ఉండటం వల్ల క్రియేటివిటీ దెబ్బతింటోందని తమ అధ్యయనంలో తేలినట్టు వివరించారు. ఈ స్టడీ వివరాలు 'ది కమ్యూనికేషన్ రివ్యూ' జర్నల్ లో ప్రచురితమయ్యాయి.

More Telugu News