: ఇలాంటి నిర్ణయాల వల్ల క్రికెట్ కు మచ్చ: కెవిన్ పీటర్సన్

పాకిస్థాన్ క్రికెటర్ మహ్మద్ అమీర్ పునరాగమనంపై ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. లండన్ లో పీటర్సన్ మాట్లాడుతూ, ఫిక్సింగ్ కు పాల్పడిన క్రికెటర్ కు పునరాగమనానికి ఎందుకు అవకాశం కల్పించారని ఐసీసీని నిలదీశాడు. ఇలాంటి నిర్ణయాలు క్రికెట్ కు మచ్చగా నిలుస్తాయని అన్నాడు. ఫిక్సింగ్ లేదా స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడి దోషిగా తేలితే అతడిపై నిషేధం విధించడమే సరైన నిర్ణయమని పీటర్సన్ అభిప్రాయపడ్డాడు. అలాగే డోపింగ్ కు పాల్పడే మహిళా క్రికెటర్లపై జీవితకాల నిషేధం సరైన శిక్ష అని పీటర్సన్ పేర్కొన్నాడు. ఇలాంటి దోషులకు రెండో అవకాశం అన్నది ఉండకూడదని స్పష్టం చేశాడు. ఒకసారి తప్పు చేసినవారు రెండోసారి అవకాశం కోరడం సహజమని కేపీ పేర్కొన్నాడు. ఈ లెక్కన చూస్తే పాకిస్థాన్ క్రికెటర్ మహ్మద్ అమీర్ క్రికెట్ ఆడటానికి అనర్హుడని పీటర్సన్ తేల్చేశాడు. గతంలో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ గ్రేమ్ స్వాన్ కూడా అమీర్ పునరాగమనంపై అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

More Telugu News