: రియోకు ముందు కలకలం... పురుషుల, మహిళల హాకీ జట్ల కెప్టెన్ల తొలగింపు

హాకీలో తలెత్తుకు నిలబడాలని, ఒలింపిక్స్ లో గత కాలపు వైభవాన్ని చూపాలని ప్రతి భారత క్రీడాభిమాని భావిస్తున్న వేళ, రియోలో ఒలింపిక్స్ ముందు హాకీ ఇండియా (హెచ్ఐ) సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. కెప్టెన్ సర్దార్ సింగ్ ను తప్పించింది. జట్టులో ఆయన్ను చేర్చినప్పటికీ, కెప్టెన్ బాధ్యతలను శ్రీజేష్ రవీంద్రకు అప్పగించింది. 16 మందితో మహిళలు, పురుషుల జట్లను హెచ్ఐ ప్రకటించగా, ప్రధాన ఆటగాడిగా, డిఫెండర్ గా ఉన్న బరీందర్ లక్రాకు కూడా స్థానం లభించలేదు. పురుషుల జట్టు వైస్ కెప్టెన్ గా ఎస్వీ సునీల్ ను నియమించిన అధికారులు, మహిళల జట్టు కెప్టెన్ రీతూ రాణిని అసలు జట్టులోకే తీసుకోలేదు. ఇటీవలి కాలంలో ఆమె ప్రవర్తన సరిగ్గా లేని కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. రీతూ స్థానంలో కెప్టెన్ గా సుశీల్ చానూను నియమిస్తున్నట్టు హెచ్ఐ వెల్లడించింది.

More Telugu News