: క్రిష్టియానో రొనాల్డో ఊహించని విజయం ఇది!

యూరో ఫుట్ బాల్ టోర్నీ ఫైనల్ లో పోర్చుగల్ ను స్టార్ స్ట్రయికర్ క్రిష్టియానో రొనాల్డో గట్టెక్కిస్తాడని అంతా భావించారు. అయితే అందరూ ఊహించినట్టే పోర్చుగల్ ఆటగాళ్లు తమ కాళ్ల మధ్యకు బంతి వచ్చిందంటే చాలు నేరుగా రొనాల్డోకు పాస్ చేసేవారు. దానిని ఒడుపుగా తప్పించుకుంటూ ఫ్రాన్స్ రక్షణ పంక్తిలోకి రొనాల్డో తీసుకుని వెళ్లేవాడు. అయితే రొనాల్డో స్పీడ్ ను ఇతర ఆటగాళ్లు అందుకోవడంలో విఫలమయ్యేవారు. దీంతో పోర్చుగల్ గోల్ కొట్టడంలో విఫలమైంది. ఇంతలో మ్యచ్ 25వ నిమిషంలో పాస్ ను రొనాల్డో అందుకున్నాడు. ఫ్రాన్స్ గోల్ పోస్టు వైపు దూసుకెళ్లేందుకు సమాయత్తమవుతుండగా పెపే నేరుగా వచ్చి రొనాల్డోను ఢీ కొట్టాడు. దీంతో రొనాల్డో కిందపడి విలవిల్లాడాడు. తరువాత ఫిజియో వచ్చి ప్రథమచికిత్స చేసినప్పటికీ అతని కాలు సహకరించలేదు. రెండడుగులు వేశాడో లేదో కిందపడ్డాడు. దీంతో ఇక ఆడలేనని నిర్ధారించుకున్నాడు. తన అసహాయతకు కుమిలిపోయాడు. స్ట్రెచర్ లో సహాయ సిబ్బంది గ్రౌండ్ బయటకు తీసుకెళ్తుంటే రొనాల్డో పొగిలిపొగిలి ఏడ్చాడు. ఇక తమ ఓటమి ఖాయమని అనుకున్నాడు. స్టార్ స్ట్రయికర్లు కలిగిన ఫ్రాన్స్ ను అడ్డుకోవడం తమ ఆటగాళ్ల వల్ల కాదని అతను భావించాడు. దీంతో రొనాల్డో మరింత ఏడ్చాడు. అతనికి సహచరులు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. కోచ్ కూడా ధైర్యం చెప్పే ప్రయత్నం చేసినా రొనాల్డో ఏడుపు ఆగలేదు. బటకు వెళ్లి రెస్ట్ రూంలో ఉండలేకపోయాడు. తిరిగి గ్రౌండ్ కు వచ్చి సిబ్బందితో కలిసి మ్యాచ్ ను వీక్షించాడు. ఈ సమయంలో ఫ్రాన్స్ ఆటగాళ్లు పలు సందర్భాల్లో పోర్చుగల్ గోల్ పై దాడులు చేశారు. డిఫెండర్లను దాటుకుని వచ్చిన ఫ్రాన్స్ ఆటగాళ్ల షాట్లను పాట్రిసీయో అద్భుతంగా అడ్డుకున్నాడు. అతను సమర్థవంతంగా అడ్డుకోకుండా ఉంటే ఫ్రాన్స్ ఆటగాళ్లు కనీసం మూడు గోల్స్ చేసి ఉండేవారు. వాటన్నింటిని ఆయన తిప్పికొట్టాడు. పుల్ టైంలో రెండు జట్లు ఎలాంటి గోల్ చేయలేకపోయాయి. అయితే, అదనపు సమయంలో రొనాల్డోకి సబ్ స్టిట్యూట్ గా వచ్చిన ఎడెర్ గోల్ కొట్టి పోర్చుగల్ కు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు.

More Telugu News