: మీ ఆరోగ్యానికి మా సహకారం అందిస్తాం: కెన్యాలో మోదీ

కెన్యాలో వైద్య రంగంలో సేవలు ప్రపంచ స్థాయి నాణ్యతతో పోలిస్తే కింది స్థాయిలో ఉన్నాయని, ఈ రంగంలో దేశం అభివృద్ధి చెందేందుకు ఇండియా తన వంతు సహకారాన్ని అందిస్తుందని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. కొద్దిసేపటి క్రితం నైరోబీలో అధ్యక్షుడితో చర్చల అనంతరం జరిగిన సంయుక్త మీడియా సమావేశంలో ఆయన ప్రసంగించారు. అత్యవసర మందులను కెన్యాకు ఎగుమతి చేయడానికి ఇండియా సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రజారోగ్యంతోనే ఏ దేశమైనా ముందడుగు వేస్తుందని, పోషకాహార నిల్వలను కెన్యాలో పెంచేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఇరు దేశాలూ హిందూ మహాసముద్రంతో కలిసున్నాయని గుర్తు చేసిన ఆయన, పరస్పర సహకారంతో అభివృద్ధి దిశగా పయనిద్దామని పిలుపునిచ్చారు. రక్షణ రంగంలో మరిన్ని ఒప్పందాలను కుదుర్చుకోవడానికి దేశాధ్యక్షుడితో తాను చర్చించానని తెలిపారు. మొత్తం ఏడు ఒప్పందాలపై సంతకాలు చేశామని వెల్లడించారు. డ్రగ్స్, నార్కోటిక్స్, హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగాల్లో సంయుక్తంగా కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్టు మోదీ వెల్లడించారు.

More Telugu News