: వోక్స్ వాగన్ హెడ్ క్వార్టర్స్ లో వరల్డ్ వార్-2 బాంబులు

జర్మనీలోని వోక్స్ వాగన్ హెడ్ క్వార్టర్స్ లో కార్మికులు విస్తరణ పనులు చేపడుతున్న వేళ, రెండవ ప్రపంచ యుద్ధం నాటి బాంబులు లభించడం కలకలం రేపింది. విషయం తెలుసుకున్న అధికారులు వీటిని నిర్వీర్యం చేసే పనిలో పడ్డారు. ప్లాంటు ఉన్న సాండ్ కాంప్ జిల్లా ఊల్ఫ్స్ బర్గ్ ప్రాంతంలో దాదాపు 700 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇంకా ఏమైనా పేలని బాంబులు ఈ ప్రాంతంలో ఉండవచ్చని భావిస్తున్న అధికారులు, వాటిని వెతికే పనిలో ఉన్నారు. కాగా, గత నెలలో కూడా ఈ ప్రాంతంలో కొన్ని పేలని బాంబులు లభ్యమైన సంగతి తెలిసిందే. తాజా ఘటనతో వోక్స్ వాగన్ ప్లాంట్ లో కార్ల ఉత్పత్తికి స్వల్ప ఆటంకాలు ఏర్పడినట్టు సంస్థ తెలిపింది.

More Telugu News