: రూ. 600 తగ్గిన వెండి ధర; రూ. 46 వేల దిగువకు!

బులియన్ మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో పది గ్రాముల బంగారం ధర స్వల్పంగా నష్టపోగా, వెండి ధర భారీగా పడిపోయింది. శుక్రవారం నాడు స్టాకిస్టులు, ఆభరణాల తయారీదారులు నూతన కొనుగోళ్లకు పెద్దగా మద్దతు చూపకపోవడంతో కిలో వెండి ధర ఏకంగా రూ. 600 నష్టపోయి రూ. 46 వేల దిగువకు చేరింది. పది గ్రాముల బంగారం ధర రూ. 50 తగ్గి రూ. 30,850 వద్దకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,354.9 డాలర్లకు చేరింది. ఇటీవలి కాలంలో విలువైన లోహాల ధరలు వరుసగా పెరుగుతూ వచ్చిన నేపథ్యంలో ప్రజల నుంచి కొనుగోళ్లు సైతం మందగించాయని నిపుణులు వ్యాఖ్యానించారు.

More Telugu News