: ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో చేరనున్న సామాజిక మాధ్యమాల పదాలు

సామాజిక మాధ్యమాల్లో తరచుగా వినియోగించే పదాలకు ఆక్స్ ఫర్డ్ ఇంగ్లీషు డిక్షనరీలో స్థానం దక్కనుంది. డిక్షనరీలో కొత్త పదాలను చేర్చుతుండటం ఆనవాయితీ. ఇందులో భాగంగా వెయ్యికి పైగా కొత్త పదాలను చేర్చి, సెప్టెంబర్ లో ఈ డిక్షనరినీ అప్ డేట్ చేయనున్నారు. ఈ విషయాన్ని బీబీసీ వెల్లడించింది. సామాజిక మాధ్యమాల్లో తరచుగా వినియోగించే ఎఫ్ డబ్ల్యూఐడబ్ల్యూ(ఫర్ వాట్ ఇట్స్ వర్త్), ఐసీవైఎంఐ (ఇన్ కేస్ యు మిస్డ్ ఇట్), బడ్జీ స్మగ్లర్స్ (పురుషుల లో దుస్తులు), గ్లాంపింగ్ (పర్యాటక ప్రాంతాల్లో ఉండే విలాసవంతమైన నివాసం), లిస్టికల్స్ (వార్తాపత్రికలు, ఇంటర్నెట్ లో ప్రచురించే ఆర్టికల్స్ ను జాబితా రూపంలో ఇవ్వటం), బోవ్వర్ (దౌర్జన్యం), డ్యూడెట్ (తోటి స్నేహితురాలు) వంటి పదాలను డిక్షనరీలో చేర్చినట్లు బీబీసీ పేర్కొంది.

More Telugu News