: అధునాతన టెక్నాలజీ... రోబో స్వీపర్లు

మనిషితో పని లేకుండా ఏ మూలన ఉన్న చెత్తనైనా చక్కగా శుభ్రం చేసే రోబో స్వీపర్లు త్వరలోనే రానున్నాయి. ‘డైసన్స్’ అనే హోమ్ అప్లయెన్సెస్ సంస్థ ‘డైసన్ 360 ఐ’ పేరుతో రోబో వ్యాక్యూమ్ క్లీనర్లను రూపొందించింది. కెమెరా సాయంతో ప్రతి అంగుళాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, సెన్సార్ల సాయంతో చెత్త ఎక్కడ ఉందో గుర్తించి ఈ రోబో స్వీపర్లు గదులను శుభ్రపరుస్తాయి. రోబో స్వీపర్లకు ఎదురుగా ఉన్న వస్తువులను ఢీ కొట్టకుండా ఉండేందుకుగాను ఇన్ ఫ్రా రెడ్ సెన్సర్లను వాటికి అమర్చారు. ఛార్జింగ్ కూడా దానంతట అదే చేసుకునే రోబో స్వీపర్ ను తయారు చేసేందుకు మూడేళ్లు శ్రమించాల్సి వచ్చింది.

More Telugu News