: టెస్టుల్లో బ్యాటు సైజుపై నిబంధనలు పెట్టాలి: పాంటింగ్

టెస్టుల్లో బ్యాటు సైజుపై నిబంధనలు అవసరమని ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. టీట్వంటీ, వన్డేల్లో పెద్ద సైజు, మందం గల బ్యాట్లను వాడినా ఇబ్బంది ఉండదని, క్రికెటర్ సామర్థ్యం తేల్చిచెప్పే టెస్టు క్రికెట్ లో బంతికి బ్యాటుకు మధ్య సమతూకం అవసరమని, అందుకే టెస్టు క్రికెట్ లో వినియోగించే బ్యాట్లపై నిబంధనలు రూపొందించాలని పాంటింగ్ సూచించాడు. ప్రస్తుత బ్యాట్ పొడవు, వెడల్పుపై మాత్రమే నిబంధనలున్నాయని గుర్తు చేసిన ఆయన, మందం, బరువుపై నిబంధనలు లేవని గుర్తు చేశాడు. దీంతో బరువైన బ్యాట్లు వాడుతూ బంతులను బౌండరీ దాటిస్తున్నారని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. టీమిండియా కెప్టెన్ ధోనీ, వెస్టిండీస్ విధ్వంస ఆటగాడు గేల్ బరువైన బ్యాట్లు వాడుతారని, వారు వాడే బ్యాట్లను మించిన బ్యాట్లు వాడే వెసులుబాటు ఇవ్వవద్దని పాంటింగ్ ఐసీసీకి సూచించాడు.

More Telugu News