: ఢాకా ముష్కరుల్లో ఇద్దరు ముంబై మత గురువు జకీర్ నాయక్ అనుచరులట!

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో అత్యంత పాశవిక దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల్లో ఇద్దరు భారత వాణిజ్య నగరం ముంబై కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న వివాదాస్పద మత గురువు మెహ్ దీ మస్రూర్ బిశ్వాస్ అలియాస్ జకీర్ నాయక్ ఫాలోయర్లట. ఢాకాలోని దౌత్య కార్యాలయాల కేంద్రం గుల్షాన్ లోని హోలి ఆర్టిసన్ బేకరీలోకి ఎంటరైన ఏడుగురు ఉగ్రవాదులు 20 మందిని అత్యంత దారుణంగా చంపేశారు. ముస్లింలను వదిలివేసిన ఉగ్రవాదులు మిగిలిన వారిని హత్య చేశారు. ప్రపంచ దేశాలను దిగ్భ్రాంతికి గురి చేసిన ఈ దాడిలో పాలుపంచుకున్న ఉగ్రవాదులంతా బంగ్లాదేశీయులేనని తేలింది. తాజాగా ఏడుగురు ఉగ్రవాదుల్లో బంగ్లా రాజకీయ పార్టీ అవామీ లీగ్ కు చెందిన ఓ నేత కుమారుడు రోహన్ ఇంతియాజ్, నిబ్రాస్ ఇస్లామ్ అనే ఇద్దరు ఉగ్రవాదులు బిశ్వాస్ కు ఫాలోయర్లుగా ఉన్నారని తేలింది. 'పీస్' టీవీలో ప్రసంగాలు చేసే బిశ్వాస్ ఒక్క భారత్ లోనే కాక ప్రపంచ దేశాల్లోని ముస్లింలందరికీ చిరపరిచితులే. ముస్లింలంతా ఉగ్రవాదులుగా మారాలని ఆయన ఒకానొక సందర్భంలో సందేశమిచ్చి పెను వివాదమే రేపారు. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరగగా... దొంగకు పోలీసు అంటే భయముంటుందని, ఈ క్రమంలో దొంగ పాలిట పోలీసు టెర్రరిస్టే అని కొత్త అర్థం చెప్పుకొచ్చారు. విద్వేషపూరిత వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తున్న బిశ్వాస్ ను ఇప్పటికే బ్రిటన్, మలేసియా, కెనడాలు తమ దేశ భూభాగంలోకి అనుమతించేది లేదని ప్రకటించాయి.

More Telugu News