: భారతీయులపై అక్కసు వెళ్లగక్కిన చైనా!

ఇండియాకు అణు సరఫరాదారుల బృందంలో ప్రవేశాన్ని గట్టిగా వ్యతిరేకించి అడ్డుకున్న చైనా, ఇప్పుడు భారతీయులు, భారత మీడియాపై అక్కసు వెళ్లగక్కుతోంది. ఇండియాకు చేతగాకనే ఎన్ఎస్జీలో ప్రవేశాన్ని పొందలేకపోయిందని, ఈ విషయంలో తమను ఎందుకు ఆడిపోసుకుంటున్నారని ఆ దేశ అధికార పత్రిక 'గ్లోబల్ టైమ్స్' ప్రశ్నించింది. భారత మీడియా చైనాను ఉద్దేశించి తప్పుడు కథనాలు ప్రచురిస్తోందని మండిపడింది. అంతర్జాతీయ సమాజం ముందు చైనా పరువును తీయాలని ప్రయత్నిస్తున్నారని, దీని బదులు వ్యతిరేకిస్తున్న దేశాల నమ్మకాన్ని పొందేందుకు కృషి చేయాలని సలహా ఇచ్చింది. ఇండియా సభ్యత్వానికి చైనా ఎందుకు అడ్డు చెప్పిందో రాస్తూ, పాత పాటనే పాడింది. గత నెలలో సియోల్ లో జరిగిన ఎన్ఎస్జీ సమావేశాన్ని, అక్కడ తీసుకున్న నిర్ణయాలను భారతీయులు జీర్ణించుకోలేకపోతున్నారని, చైనాను నిందిస్తూ, అన్ని భారత పత్రికలూ వ్యాసాలు రాశాయని తెలిపింది. ఎన్ఎస్జీ సభ్యత్వం కావాలంటే ఎన్పీటీలో సభ్యత్వం పొందడం తప్పనిసరని, ఇండియాకు ఆ హోదా ఇంకా లేదని గుర్తు చేసింది.

More Telugu News