: పాకిస్థాన్ క్రికెట్ బోర్డును ఆదుకోండి: బోర్డు చైర్మన్ షహర్యార్ ఖాన్

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)ను ఆర్థికంగా ఆదుకోవాలంటూ బోర్డు చైర్మన్ షహర్యార్ ఖాన్ కోరారు. ఎడిన్ బర్గ్ లో జరిగిన ఐసీసీ వార్షిక సమావేశంలో ఈమేరకు విజ్ఞప్తి చేశారు. నష్టాలను ఎదుర్కొంటున్న పీసీబీకి నిధులు కేటాయించాలని కోరారు. కాగా, 2009లో పాకిస్థాన్ లో పర్యటించిన శ్రీలంక జట్టు సభ్యులు ఉన్న ఒక బస్సుపై ఉగ్రవాదుల దాడి జరిగినప్పటి నుంచి విదేశీ జట్లు అక్కడ ఆడేందుకు వెళ్లడం లేదు. అయితే, పరిమిత ఓవర్ల మ్యాచ్ ల నిమిత్తం జింబాబ్వే జట్టు గత ఏడాది పాకిస్థాన్ లో పర్యటించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో సొంత మ్యాచ్ లను నిర్వహించడం ద్వారా గత ఏడేళ్లలో సుమారు రూ.100 మిలియన్ అమెరికన్ డాలర్ల నష్టం వచ్చినట్లు వెల్లడించారు.

More Telugu News