: ఆ పురస్కారం అందుకునేంత వయసు తనకు లేదనే శ్రీదేవి రాలేదట!

స్పెయిన్ లో ఇటీవల ఐఫా పురస్కారాలు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ హీరోహీరోయిన్లు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కానీ, అందాల తార శ్రీదేవి మాత్రం హాజరుకాలేదు. ఐఫా జీవిత సాఫల్య పురస్కారానికి ఎంపికైన శ్రీదేవి ఈ కార్యక్రమానికి హాజరుకాకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంతకీ, ఈ పురస్కారం అందుకునేందుకు ఎందుకు రాలేదన్న విషయాన్ని బాలీవుడ్ వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఇంత పెద్ద పురస్కారం అందుకునే వయసు తనకు ఇంకా రాలేదని శ్రీదేవి భావిస్తోందని, అందుకే ఈ కార్యక్రమానికి ఆమె హాజరుకాలేదని ఆమె సన్నిహితులు చెబుతున్నారట. అయితే, శ్రీదేవి ప్రతిభా పాటవాలను మాత్రం సోనాక్షి సిన్హా ఈ వేడుకల్లో ప్రశంసలతో ముంచెత్తింది.

More Telugu News