: రెగ్జిట్.. సెగ్జిట్.. టెగ్జిట్.. మీకీ ఎగ్జిట్‌ల గురించి తెలుసా..?

అమెరికా మాజీ అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ హయాంలో వాటర్‌గేట్ కుంభకోణం కుదిపేసింది. అప్పటి నుంచి కుంభకోణానికి ‘గేట్’ అనే పదం ప్రత్యామ్నాయంగా మారిపోయింది. యూరోపియన్ యూనియన్‌లో బ్రిటన్ కలిసి ఉండాలా? లేదా? అని ఇటీవల నిర్వహించిన రెఫరెండంతో ‘బ్రెగ్జిట్’ (బ్రిటన్, ఎగ్జిట్ పదాలను కలిపి బ్రెగ్జిట్ అన్నారు) ప్రపంచవ్యాప్తంగా పాప్యులర్ అయిపోయింది. అదే రీతిలో ఫలానాది వీడిపోవడం అనే పదానికి ఇప్పుడు పలు పేర్లు వినిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎగ్జిట్‌లు ప్రధానవార్తలు అయ్యాయి. అవేంటో చూద్దాం. రెగ్జిట్.. ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ పదవీకాలం ముగియడం, ఆయన రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టేందుకు సుముఖంగా లేకపోవడంతో ‘రెగ్జిట్’ ఖాయమంటూ పత్రికలు కథనాలు ప్రచురించాయి. సెగ్జిట్ బ్రెగ్జిట్, రెగ్జిట్‌పై స్పందించిన బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ ‘‘ఇటీవల ఈ ట్రెండ్‌ను వార్తలో వింటున్నాను. ఎవరైనా వెళ్లిపోతుంటే దానిని రెగ్జిట్, బ్రెగ్జిట్ అంటూ హెడ్‌లైన్స్‌లో ప్రచురిస్తున్నారు. సో.. నేను వెళ్లిపోతే దానిని సెగ్జిట్ అంటారేమో.. ’’ అని మైక్రోబ్లాగ్‌లో రాసుకొచ్చారు. ఫ్రెగ్జిట్ బ్రెగ్జిట్ తర్వాత యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చేందుకు ఫ్రాన్స్ ప్రయత్నిస్తోంది. అక్కడ కూడా రెఫరెండం కావాలని కోరుతున్నారు. దీనిని ఫ్రెగ్జిట్‌గా వ్యవహరిస్తున్నారు. నెగ్జిట్ బ్రెగ్జిట్ సందర్భంగా బ్రిటన్ నేత నైగిల్ ఫరాగే మాట్లాడుతూ నెదర్లాండ్స్ కూడా త్వరలో ఈయూ నుంచి బయటకు వస్తుందని జోస్యం చెప్పారు. దీనిని నెగ్జిట్‌ అంటున్నారు. స్వెగ్జిట్ బ్రెగ్జిట్ తరహాలోనే స్వీడన్‌లో స్వెగ్జిట్ ఊపందుకుంది. మెగ్జిట్ అర్జెంటీనాకు చెందిన అంతర్జాతీయ ఫుట్‌బాల్ ఆటగాడు లియోనల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించారు. దీనిని మెగ్జిట్ అంటూ పత్రికలు పతాక శీర్షికలు పెట్టాయి. ఘెగ్జిట్ కనపించకుండా ఎవరైనా భయపెడితే అది ఘెగ్జిట్ టెగ్జిట్ టెక్ట్స్ మెసేజ్‌ల వల్ల భాగస్వామితో సంబంధాలు దెబ్బతింటే అది టెగ్జిట్.. ఇలా పలు ఎగ్జిట్‌లు ప్రపంచవ్యాప్తంగా అటు పత్రికల్లోనూ ఇటు సామాజిక మాధ్యమాల్లోనూ ప్రధానంగా కనిపిస్తున్నాయి. మరో కొత్తపదం తెరపైకి వచ్చే వరకు ఇవి చలామణిలో ఉంటాయనడంలో ఎటువంటి సందేహం లేదు.

More Telugu News