: వాట్స్ యాప్ తదితరాలను నిషేధించలేం: కేసు కొట్టేసిన సుప్రీం

ఖాతాదారుల మధ్య బట్వాడా అయ్యే సమాచారాన్ని మరొకరికి తెలియకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్న వాట్స్ యాప్ తదితర సామాజిక మాధ్యమ యాప్ లను నిషేధించాలంటూ దాఖలైన ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. స.హ.చట్టం కార్యకర్త సుధీర్ యాదవ్ వేసిన పిటిషన్ పై చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్ ల ధర్మాసనం విచారణ జరిపి, ఈ విషయంలో పిటీషనర్ సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించింది. ఈ సోషల్ మీడియా యాప్ లను నిషేధించాలని లేకుంటే, వాటి నుంచి వెళ్లే డేటా ప్రభుత్వ వర్గాలకు అందుబాటులో ఉండేలా ఆదేశించాలని అంతకుముందు సుధీర్ తరఫు న్యాయవాది కోర్టు ముందు వాదనలు వినిపించారు. మధ్యలో ఎవరూ తెలుసుకోలేని విధంగా ఈ సమాచారం ఉందని, దీనివల్ల భద్రతకు ముప్పు ఏర్పడుతుందని తెలిపారు.

More Telugu News