: యుద్ధంతో కాశ్మీర్ ను సాధించలేం: హీనా రబ్బానీ వ్యాఖ్యలు

భారత్-పాక్ ల మధ్య శత్రుత్వాన్ని రేపుతూ, దశాబ్దాలుగా నలుగుతున్న కాశ్మీర్ వివాదంపై పాకిస్థాన్ మాజీ విదేశాంగ శాఖ మంత్రి హీనా రబ్బానీ ఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జియో న్యూస్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా వివాదాస్పద కాశ్మీర్ అంశంపై ఆమె సునిశితమైన వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్‌ ను యుద్ధం ద్వారా పాకిస్థాన్ సాధించుకోలేదని తాను భావిస్తున్నానని అన్నారు. భారత్ తో యుద్ధం చేయనప్పుడు మిగిలి ఉన్న ప్రత్యామ్నాయం ఇక చర్చలేనని ఆమె స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య చర్చలు జరగాలంటే అందుకు అవసరమైన సంబంధాలు, పరస్పర విశ్వాసం ఉండాలని, అప్పుడే చర్చలు కార్యరూపం దాల్చుతాయని ఆమె పేర్కొన్నారు. భారత్‌ లో బీజేపీ, పాకిస్థాన్‌ లో సైనిక ప్రభుత్వం ఉన్నప్పుడే కశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కొందరు నమ్ముతున్నట్టు ఆమె తెలిపారు. సైన్యం భాగస్వామిగా ఉన్న దౌత్య అంశాలపై పాకిస్థాన్ సైనిక ప్రభావం తప్పకుండా ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.

More Telugu News