: మళ్లీ గెలిచినా మెజారిటీకి దూరంగా స్పెయిన్ అధికార పార్టీ!

స్పెయిన్ లో జరిగిన సాధారణ ఎన్నికల్లో అధికార పాప్యులర్ పార్టీ విజయం సాధించినప్పటికీ, మెజారిటీకి మాత్రం దూరంగానే నిలిచింది. మొత్తం 350 సీట్లున్న స్పెయిన్ లో ఆదివారం జరిగిన ఎన్నికల్లో కనీస మెజారిటీకి కావాల్సిన 176 సీట్లను ఒకే పార్టీ సాధిస్తేనే ప్రభుత్వం ఏర్పాటుకు వీలుండగా, పాప్యులర్ పార్టీ 137 సీట్లకే పరిమితమైంది. రెండో స్థానంలో నిలిచిన సోషలిస్టు పార్టీ 85 సీట్లతో సరిపెట్టుకుంది. మిగతా స్థానాలను చిన్న పార్టీలు, స్వతంత్ర సభ్యులు గెలిచారు. దీంతో పీపీ గెలిచినా మెజారిటీ లేకపోవడంతో, మిగతా పార్టీల నుంచి మద్దతు ఏ మేరకు లభిస్తుందన్న విషయమై చర్చలు సాగుతున్నాయి. తాత్కాలిక ప్రధానిగా ఉన్న మారియానో రజోయ్ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే, మరో 39 మంది ప్రజా ప్రతినిధుల మద్దతును కూడగట్టాల్సి వుంది. గత సంవత్సరం డిసెంబరులో సైతం పీపీ అత్యధిక సీట్లు గెలిచినప్పటికీ, మెజారిటీ సాధించలేకపోయిన సంగతి తెలిసిందే.

More Telugu News