ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

టీమిండియా టెస్టులు, వన్డేల షెడ్యూల్ ఇలా సాగుతుంది...!

Tue, Jun 28, 2016, 02:33 PM
Related Image ఈ సీజన్ లో టీమిండియా షెడ్యూల్ ప్రకారం మన దేశంలో 13 టెస్టులు, 8 వన్డేలు, మూడు టీ-20 మ్యాచ్ లు ఆడనుంది. ఈ క్రమంలో తొలుత న్యూజిలాండ్ జట్టుతో 3 టెస్టులు, 5 వన్డేలు ఆడుతుంది. ఇందుకు సంబంధించిన మ్యాచ్ ల తేదీలు, వేదికల వివరాలను బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతాలో ఉంచింది. వాటి వివరాలు... న్యూజిలాండ్ తో మొదటి టెస్టు మ్యాచ్- కాన్పూర్ లో సెప్టెంబరు 22 నుంచి 26 వరకు, రెండో టెస్ట్ మ్యాచ్- ఇండోర్ లో సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 4 వ తేదీ వరకు, మూడో టెస్ట్ మ్యాచ్ - కోల్ కతాలో అక్టోబరు 8 నుంచి 12వ తేదీ వరకు జరగనున్నాయి. వన్డే మ్యాచ్ ల విషయానికొస్తే, మొదటి వన్డే- ధర్మశాలలో అక్టోబరు 16న, రెండో వన్డే- ఢిల్లీలో అక్టోబరు 19న, మూడో వన్డే- మొహాలీలో అక్టోబరు 23న, నాలుగవ వన్డే- రాంచీలో అక్టోబరు 26న, ఐదో వన్డే- విశాఖపట్నంలో అక్టోబరు 29న జరుగుతాయి.
X

Feedback Form

Your IP address: 54.167.149.128
Articles (Latest)
Articles (Education)