ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నాలుగేళ్ల వయసులో అమ్మ ప్రాణం నిలిపిన బుడతడు!

Tue, Jun 28, 2016, 10:21 AM
వాడి వయసు కేవలం నాలుగు సంవత్సరాలు. సాధారణంగా ఆ వయసు పిల్లలకు ఆకలైతే అన్నం కావాలని అడగడం తప్ప మరేమీ తెలియదు. కానీ, ఇటలీలోని ఈ బుడ్డోడు మాత్రం స్పెషల్. తన తల్లి ప్రాణాన్ని కాపాడి అందరితో శభాష్ అనిపించుకున్నాడు. తన తల్లితో కలసి కారులో వెళుతున్న సమయంలో ఆమెకు గుండెపోటు వచ్చింది.

కారును రోడ్డు పక్కన ఆపిన ఆమె, స్టీరింగుపైనే కుప్పకూలిపోగా, వెంటనే కారు దిగిన ఈ చిన్నోడు, రోడ్డుపై పోయే వాళ్లను ఆపాడు. తన తల్లికి ఏదో అయిందని, ఎమర్జెన్సీ నెంబరుకు ఫోన్ చేయాలని కోరాడు. ఆ దారిలో వెళుతున్న వారు ఎమర్జెన్సీ నెంబరుకు ఫోన్ చేసి సమాచారం చెప్పడంతో, వెంటనే అక్కడకు చేరుకున్న ఆంబులెన్స్ సిబ్బంది ఆమెను ఆసుపత్రికి చేర్చారు. సకాలంలో ఆమెను తీసుకు రావడం వల్లనే ప్రాణాలు దక్కాయని, బాలుడు తెలివిగా స్పందించాడని వైద్యులు వెల్లడించారు.
X

Feedback Form

Your IP address: 54.158.167.137
Articles (Latest)
Articles (Education)