: కేసీఆర్ సర్కారుకు బూస్ట్!... మల్లన్నసాగర్ భూసేకరణపై రైతుల పిటిషన్ ను కొట్టేసిన హైకోర్టు!

ఇటీవలి కాలంలో పలు కీలక అంశాలకు సంబంధించి తెలంగాణ సర్కారుకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో వరుసగా ఎదురు దెబ్బలు తగిలాయి. అయితే మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి హైకోర్టు మద్దతిస్తూ కీలక తీర్పు చెప్పింది. మల్లన్న సాగర్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం చేపట్టనున్న భూసేకరణను వ్యతిరేకిస్తూ మెదక్ జిల్లాకు చెందిన 12 మంది రైతులు వేసిన పిటిషన్ ను ధర్మాసనం కొద్దిసేపటి క్రితం కొట్టివేసింది. పిటిషన్ విచారణ సందర్భంగా అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి వినిపించిన వాదనలను హైకోర్టు సమర్ధించింది. రైతులకు ఇష్టం లేకుండా బలవంతంగా భూసేకరణ చేసేది లేదని తేల్చిచెప్పిన ఏజీ తెలంగాణ సర్కారు వాదనను గట్టిగా వినిపించారు. దీంతో నిబంధనల మేరకే భూసేకరణ జరుగుతుందని, ఇందులో రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పిన హైకోర్టు రైతుల పిటిషన్ ను కొట్టివేసింది.

More Telugu News