: ఎన్ఎస్జీ రాకున్నా ఎంటీసీఆర్ లో పూర్తి సభ్యత్వం పొందిన భారత్... ఇక క్షిపణుల వ్యాపారం చేసుకోవచ్చు

ఇండియాలో తయారు చేసే పృథ్వి తరహా క్షిపణులను ఇకపై విదేశాలకు విక్రయించవచ్చు. బ్రహ్మోస్ ఖండాంతర క్షిపణుల ఆర్డర్లు తీసుకుని తయారు చేసి అమ్ముకోవచ్చు. ఈ దిశగా ఎంటీసీఆర్ (మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజీమ్)లో నేటి నుంచి భారత్ పూర్తి స్థాయి సభ్య దేశంగా రూపాంతరం చెందనుంది. 48 దేశాల అణు సరఫరాల బృందంలో చేరలేకపోయిన తరుణంలో ఎంటీసీఆర్ లో పూర్తి సభ్యత్వం శుభపరిణామమని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ ట్వీట్ చేశారు. గత సంవత్సరంలో పూర్తి సభ్యత్వం కోసం ఇండియా దరఖాస్తు చేసిందని ఆయన తెలిపారు. నేడు జరిగే ఓ కార్యక్రమంలో, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, లగ్జెంబర్గ్ ప్రతినిధుల సమక్షంలో విదేశాంగ శాఖ కార్యదర్శి ఎస్.జైశంకర్ ఎంటీసీఆర్ పై సంతకాలు చేయనున్నారని తెలిపారు. కాగా, 34 దేశాలు సభ్యులుగా ఉన్న ఇదే గ్రూప్ లో చైనా కూడా ఉన్నప్పటికీ, ఇండియాను అడ్డుకునేందుకు కారణాలేవీ లేకపోయాయి. ఎన్ఎస్జీలో భారత సభ్యత్వాన్ని సౌత్ ఆఫ్రికా, నార్వే, బ్రెజిల్, ఆస్ట్రియా, న్యూజిలాండ్, ఐర్లాండ్, టర్కీలతో కలిసి చైనా అడ్డుకున్న సంగతి తెలిసిందే.

More Telugu News