: మూడో కంటికి తెలియకుండా సదావర్తి సత్రం భూములను కొట్టేశారు: ధర్మాన ప్రసాదరావు

వైఎస్సార్సీపీ నిజనిర్ధారణ కమిటీ చెన్నైలో పర్యటించింది. చెన్నై పాలంబూరులోని సదావర్తి సత్రం భూములను వైఎస్సార్సీపీ నేత ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలోని కమిటీ పరిశీలించింది. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ, సదావర్తి సత్రం భూములను మూడో కంటికి తెలియకుండా టీడీపీ నేతలు కొట్టేశారని ఆరోపించారు. మొత్తం 83 ఎకరాల భూమిని టీడీపీ నేతలు స్వాహా చేశారని, బహిరంగ మార్కెట్ ప్రకారం ఎకరా విలువ రూ.10 కోట్లు ఉండగా, తమ అనుచరులకు రూ.27 లక్షలకే ప్రభుత్వం కట్టబెట్టిందని ఆరోపించారు. ఈ విషయం తెలిసిన సీఎం చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ఆయన ప్రశ్నించారు. ‘సత్రం భూముల అమ్మకాల్లో లోకేష్ ప్రమేయం ఉందా? సత్రం భూముల వేలాన్ని రద్దు చేస్తే ఇబ్బందేంటి?’ అంటూ ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. సత్రం భూముల వేలాన్ని రద్దు చేయాలని అందరూ కోరుతున్నారని, వెయ్యికోట్లకు పైగా దోపిడీ జరిగిన విషయం స్పష్టంగా బయటపడుతోందన్నారు. ఈ విషయమై సీఎం, సంబంధిత మంత్రి వెంటనే స్పందించాలని ధర్మాన డిమాండ్ చేశారు.

More Telugu News