: ట్రిగ్గర్ నొక్కారు... బులెట్ ఇక వెనక్కు పోదు: బ్రిటన్ నిష్క్రమణపై ఈయూ

"యూరోపియన్ యూనియన్ నుంచి వీడిపోతామని బ్రిటన్ నుంచి మేమేమీ నోటీసును కోరుకోవడం లేదు. రెండేళ్ల కౌంట్ డౌన్ సమయం కూడా అక్కర్లేదు. వెంటనే బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్, ఈయూను వీడే ప్రక్రియ ప్రారంభించుకోవచ్చు" అని యూరోపియన్ యూనియన్ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. తిరిగి యూనియన్ లోనే ఉండాలని బ్రిటన్ భావిస్తే..? అన్న ప్రశ్న సంధించగా, బ్రిటన్ ట్రిగ్గర్ నొక్కేసిన తరువాత బులెట్ ఇక వెనక్కు పోదని వ్యాఖ్యానించారు. బ్రిటన్ వీడే ప్రక్రియ ఆలస్యం అయ్యే కొద్దీ సభ్యదేశాల్లో ఆందోళన పెరుగుతూ ఉంటుందని అన్నారు. ఈయూ ఒప్పందం ప్రకారం, వైదొలగడానికి రెండేళ్ల ప్రక్రియ అవసరమే అయినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో అంత సమయం పట్టకపోవచ్చని అన్నారు.

More Telugu News