: భారతీయులు తినే తిండిలో మూడోవంతు విదేశాలదే!

భారతీయులు తింటున్న ఆహారంలో 35 శాతం విదేశాల నుంచి వస్తున్నదేనని ఇంటర్నేషనల్ సెంటర్ ఆఫ్ ట్రాపికల్ అగ్రికల్చర్ ప్రకటించింది. 177 దేశాలపై అధ్యయనం నిర్వహించిన ఈ సెంటర్, ఇండియాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ, టొమాటో, మిర్చి వంటివి కూడా ఇండియాకు దిగుమతి అయి వచ్చినవేనని తెలిపింది. పండ్లు, సుగంధ ద్రవ్యాలు, నూనెలు, పంచదార తదితర ఎన్నో ఉత్పత్తులు ఇతర దేశాల నుంచి ఇండియాకు వచ్చాయని శాస్త్రవేత్త సుబోధ్ వర్మ వెల్లడించారు. ఇవన్నీ శతాబ్దాల క్రితమే వాణిజ్య రూపంలో ఉపఖండంలోకి ప్రవేశించాయని తెలిపారు. జాతీయ ఆహార ఉత్పత్తిలో ఈ తరహా విదేశీ ఆహారం 45 శాతం వరకూ ఉందని తెలిపారు. ఉల్లిపాయలు, గోధుమలు పశ్చిమాసియా నుంచి; బంగాళాదుంపలు, టొమాటో సౌత్ అమెరికా నుంచి; మిరప సెంట్రల్ అమెరికా నుంచి; అల్లం, యాపిల్స్ సెంట్రల్ ఆసియా ప్రాంతాల నుంచి ఇండియాకు వచ్చాయని తమ అధ్యయనంలో వెల్లడైనట్టు వర్మ వివరించారు.

More Telugu News