: శాంతి భద్రతల నేపథ్యంలో హైదరాబాద్ లో నిషేధాజ్ఞలు

రంజాన్ మాసం సందర్భంగా శాంతి భద్రతల సమస్య ఎదురు కావచ్చన్న ఆలోచనతో హైదరాబాద్ లో పలు నిషేధాజ్ఞలు విధిస్తున్నట్టు నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి ప్రకటించారు. తక్షణం అమలులోకి వచ్చే ఈ ఆంక్షలు జూలై 2 వరకూ అమలులో ఉంటాయని పేర్కొన్నారు. ఇందులో భాగంగా, అసెంబ్లీ, సచివాలయం, జీహెచ్ఎంసీ, పబ్లిక్ గార్డెన్స్, నాంపల్లి, ఎన్టీఆర్ మార్గ్ తదితర ప్రాంతాల్లో అనుమతి లేకుండా బహిరంగ సభలు, సమావేశాలు జరపరాదు. కత్తులు, కర్రలు, రాళ్లు వంటి మారణాయుధాలతో కనిపించినా, రోడ్లపై గుమికూడినా, శాంతి భద్రతలకు ఆటంకం కలిగించినా, చట్ట ప్రకారం వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఈ ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలవుతుందని తెలిపారు. అన్ని మసీదుల వద్దా ప్రార్థనల సమయంలో పోలీసు బందోబస్తు ఉంటుందని తెలిపారు.

More Telugu News