: మారుతున్న బ్రిటన్ మనసు... మరో రెఫరెండానికి డిమాండ్ చేస్తున్న 20 లక్షల మంది

యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోవాలని తీర్పిచ్చిన యూకే ప్రజలు, ఇప్పుడు మరోసారి రెఫరెండం జరపాలని డిమాండ్ చేస్తున్నారు. కేవలం 75 శాతం మంది మాత్రమే ఓట్లు వేయడం, కూటమిలో ఉండాలని, వద్దన్న వారి మధ్య తేడా చాలా తక్కువగా ఉండటంతో, మరో రెఫరెండం కోసం విలియన్‌ ఒలివర్‌ అనే వ్యక్తి, ఓ వెబ్ సైట్ మాధ్యమంగా సంతకాల ఉద్యమం చేపట్టగా, ఇప్పటివరకూ 20 లక్షల మందికి పైగా మద్దతిచ్చారు. బ్రెగ్జిట్ కు వ్యతిరేకంగా ఓటు వేసిన లండన్, ఆక్స్ ఫర్డ్, కేంబ్రిడ్జి, మాంచెస్టర్ ప్రాంత వాసుల్లో అత్యధికులు దీనిపై సంతకం చేశారు. కాగా, ప్రజల ఆకాంక్షపై బ్రిటన్ పార్లమెంటులో చర్చించనున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కాగా, రెండో రెఫరెండం కావాలంటూ ఒకేసారి అత్యధిక సంఖ్యలో ప్రజలు ఈ వెబ్ సైట్లో సంతకం చేసేందుకు యత్నించడంతో, సైట్ స్తంభించిపోవడం గమనార్హం.

More Telugu News