: రూ. 2 వేలు జంప్ చేసిన బంగారం ధర!

బ్రెగ్జిట్ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపిన వేళ, బులియన్ మార్కెట్ దూసుకెళ్లింది. ఈక్విటీల్లోని పొజిషన్లను ఉపసంహరించుకుంటున్న ఇన్వెస్టర్లు బంగారం, వెండిపై పెట్టుబడులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నాటి సెషన్లో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం విలువ రూ. 1,934 పెరిగి రూ. 31,848కి చేరుకుంది. ఇది ఆగస్టు 5 నాటికి డెలివరీ అయ్యే కాంట్రాక్టు. ఇటీవలి కాలంలో బంగారం ధర ఒక రోజు సెషన్లో ఇంత భారీగా పెరగడం ఇదే తొలిసారి. ఇక జూలై 5 నాటి కాంట్రాక్టులో వెండి ధర క్రితం ముగింపుతో పోలిస్తే రూ. 1,689 పెరిగి రూ. 42,879కి చేరింది. క్రూడాయిల్ భారత బాస్కెట్ ధర 3.96 శాతం తగ్గి రూ. 3,222 వద్ద కొనసాగుతోంది.

More Telugu News