: వివాదాస్పదమైన ఆ 'దైవ హస్తం' గోల్ కు 30 ఏళ్లు!

సరిగ్గా 30 సంవత్సరాల క్రితం, 1986, జూన్ 22న మెక్సికో నగరంలోని అజ్టెకా స్టేడియం. వరల్డ్ కప్ ఫుట్ బాల్ పోటీలు జరుగుతున్న వేళ. అర్జెంటీనా, ఇంగ్లండ్ ల మధ్య పోటీ జరుగుతోంది. దాదాపు 1.15 లక్షల మంది అభిమానులు ఉత్కంఠగా చూస్తున్న వేళ, ఓ గోల్ డిగో మారడోనాను వరల్డ్ స్టార్ గా చేసింది. అదే 'హ్యాండ్ ఆఫ్ గాడ్' (దైవ హస్తం) గోల్. ఓ ఆటగాడు పాస్ చేసిన బంతిని డిగో మారడోనా గోల్ లోకి పంపాడు. అతను తలతో బంతిని తాకుతున్నట్టు ఓ వైపు నుంచి, నిబంధనలకు విరుద్ధంగా చేతితో బంతిని నెడుతున్నట్టు మరో వైపు నుంచి కనిపిస్తున్న వీడియో ఇప్పటికీ హల్ చల్ చేస్తూనే ఉంది. దీనిపై బ్రిటన్ ఆటగాళ్లు అప్పట్లో ఎంత గగ్గోలు పెట్టినా రిఫరీలు గోల్ చేసినట్టే ప్రకటించారు. "వాస్తవానికి గోల్ ఇవ్వరని నాకు అనిపించింది. ఎందుకంటే నన్ను అభినందించేందుకు ఆటగాళ్లు ఎవరూ ముందుకు రాలేదు. వచ్చి నన్ను కౌగిలించుకోండి అని వారిని కోరాల్సి వచ్చింది. లేకుంటే రిఫరీ గోల్ ను ఇవ్వరని భావించాను. బంతి నా తలకు తగిలిందో, చేతికి తగిలిందో నాకే తెలియదు" అని మారడోనా వ్యాఖ్యానించాడు. ఒకవేళ నా చెయ్యే తగిలుంటే అది 'హ్యాండ్ ఆఫ్ గాడ్' మాత్రమే అని చెప్పాడు. ఆపై మారడోనా గోల్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత చర్చనీయాంశమైంది కూడా. ఆ మ్యాచ్ లో అర్జెంటీనా 2-1 తేడాతో విజయం సాధించింది. తన జీవితంపై మారడోనా రాసుకున్న స్వీయ చరిత్ర నుంచి ఫుట్ బాల్ పై రచించిన ఎన్నో పుస్తకాల్లో ఈ గోల్ గురించిన చర్చ జరిగింది. ఇప్పటికీ జరుగుతూనే ఉంది.

More Telugu News