: ఎల్ఈడీ లైట్ల వెలుగులకు రెటీనా దెబ్బతింటుందట!

అమెరికాలో ఎల్ఈడీ బల్బుల వాడకం పెరగడంపై అక్కడి వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల సియాటిల్, న్యూయార్క్ నగరాల్లో ఎల్ ఈడీ వీధి దీపాలను కొత్తగా వినియోగించారు. వీటివల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఫిర్యాదులు కూడా అందాయి. ఈ నేపథ్యంలో అమెరికా మెడికల్ సంఘం ఒక నివేదిక తయారు చేసింది. ఎల్ఈడీ బల్బులు విరజిమ్మే కాంతికి కంటి రెటీనా దెబ్బతినే అవకాశముందని అమెరికా వైద్యులు అభిప్రాయపడుతున్నారు. వైద్యుల అధ్యయనం ప్రకారం రాత్రి సమయంలో కలర్ టెంపరేచర్ మూడు వేల కెల్విన్లు దాటకూడదు. ముఖ్యంగా బ్లూ, గ్రీన్, ఎల్లో, రెడ్ రంగుల కలర్ టెంపరేచర్ ఉష్ణోగ్రత ఆ స్థాయిని మించకూడదు. కలర్ టెంపరేచర్ ఆ స్థాయిని దాటితే కనుక బ్లూ రంగు కాంతి ఎక్కువగా విడుదలవుతుందని పేర్కొన్నారు. కలర్ టెంపరేచర్ స్థాయి దాటితే కేవలం మనుషులకే కాకుండా పర్యావరణానికి కూడా ముప్పేనని పేర్కొన్నారు. కాగా, తక్కువ విద్యుత్తు ఖర్చు అయ్యే ఎల్ఈడీ లైట్లను వీధి దీపాలుగా పలు చోట్ల వినియోగిస్తున్న విషయం తెలిసిందే.

More Telugu News