: థాంక్యూ వెరీమచ్ బ్రో..: హీరోయిన్ అనుష్క

దక్షిణాది ముద్దుగుమ్మ అనుష్క తన సోదరుడికి థాంక్స్ చెప్పింది. ఎందుకంటే, ‘రుద్రమదేవి’ చిత్రానికి గాను ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్న సందర్భంగా అనుష్కకు, ఆ చిత్ర బృందానికి సోదరుడు గుణరంజన్ శెట్టి శుభాకాంక్షలు తెలిపాడు. కృషి, పట్టుదల, అంకితభావంతో పనిచేయడం వల్లే ఈ విజయం దక్కిందని, భవిష్యత్తులో మరెన్నో విజయాలు అనుష్క అందుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానని సామాజిక మాధ్యమంలో ఆయన తెలిపారు. అనుష్కకు ఈ అవార్డు రావడం తనకెంతో గర్వకారణంగా ఉందని అన్నారు. దీనికి స్పందించిన అనుష్క తన ఫేస్ బుక్ ఖాతాలో ‘థాంక్యూ వెరీ మచ్ బ్రో.. లాట్సాఫ్ లవ్’ అంటూ పోస్ట్ చేసింది. దీంతో పాటు తన అన్నతో కలిసి దిగిన ఒక సెల్ఫీని కూడా తన అభిమానులకు షేర్ చేసింది.

More Telugu News