: హెడ్ ఫోన్స్ పెట్టుకుని నిద్రపోయే అలవాటు ఉంటే వెంటనే మానండి!

హెడ్ ఫోన్స్ పెట్టుకుని పాటలు, మ్యూజిక్ లేదా ఇతర ఆడియోలు వింటూ రాత్రి నిద్రలోకి జారుకునే వారు ఉంటారు. కొంతమంది నిద్ర పట్టే సమయంలో హెడ్ ఫోన్స్ ను తీసేస్తారు. మరికొందరు వాటిని అలానే ఉంచుకుని నిద్రపోతుంటారు. ఈవిధంగా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్లే నని వైద్యులు అంటున్నారు. ఎందుకంటే, మనం నిద్రించేటప్పుడు మెదడు పూర్తి స్థాయి విశ్రాంతి తీసుకుంటుందని, హెడ్ ఫోన్స్ ను అలాగే ఉంచుకుని నిద్రపోతే మెదడుపై తీవ్ర ఒత్తిడి పడుతుందని, శరీరంలో బ్యాక్టీరియా వృద్ధి చెందుతుందని వైద్యులు చెబుతున్నారు. నిద్రలేమి, అలసట వంటి ఇతర సమస్యలు కూడా తలెత్తుతాయని అంటున్నారు. హెడ్ ఫోన్స్ పెట్టుకుని పాటలు, సంగీతం వింటూ వాటిని తీయకుండా నిద్రపోయే అలవాటు ఉంటే కనుక వెంటనే దానికి స్వస్తి చెప్పాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

More Telugu News