: చూడకుండానే లైక్, చదవకుండానే షేర్: నెటిజన్ల తీరుపై కొత్త అధ్యయనం

సామాజిక మాధ్యమాల్లో వచ్చే అభిప్రాయాలకు వచ్చిన లైక్ లు, షేర్లను బట్టి దాని ప్రజాదరణను లెక్కించాల్సిన అవసరం లేదని ఓ అధ్యయనం వెల్లడించింది. ట్విట్టర్, ఫేస్ బుక్ తదితరాలను వినియోగిస్తున్న నెటిజన్ల తీరు విచిత్రంగా ఉందని, పోస్టులను చూడకుండానే లైక్ లు కొడుతున్నారని, చదవకుండానే షేర్ చేస్తున్నారని కొలంబియా యూనివర్శిటీ, ఫ్రెంచ్ కంప్యూటర్ సైన్స్ ఆటోమేషన్ ల సంయుక్త పరిశోధనలో వెల్లడైంది. ట్విట్టర్ వ్యాసాల్లో అత్యధికం కొన్ని గంటల్లోనే షేర్ అవుతోందని, చదివేందుకు రెండు వారాల సమయం పట్టే స్టోరీలు సైతం వెంటనే షేర్ అవుతున్నాయని అధ్యయనంలో పాల్గొన్న సైంటిస్ట్ అర్నాడ్ లెగౌట్ వెల్లడించారు. సమాచారం ఏంటని కూడా తెలుసుకోకుండా దాన్ని ఇష్టపడుతున్నామని చెప్పేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని, ఆ వెంటనే వాటిని షేర్ చేసుకుంటున్నారని ఆయన తెలిపారు. షేర్ కు, పోస్టును చూసేందుకు సంబంధం లేదని తమ స్టడీలో తేలినట్టు తెలిపారు. ఇక సామాజిక మాధ్యమాల్లో పోస్టులపై ప్రజా స్పందన ఎలా ఉందన్న విషయాన్ని తెలసుకునేందుకు కొత్త ప్రమాణాలను రూపొందించాల్సిన సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు.

More Telugu News