: సెల్ఫీలతో కొత్త చిక్కు... చర్మం ముడతలు పడుతుందట!

సెల్ఫీ తీసుకుంటే చర్మం ముడతలు పడే అవకాశం ఉందని తాజా పరిశోధనలో తేలింది. మొబైల్ నుంచి వచ్చే రేడియేషన్ ప్రభావంతో చర్మంపై ముడతలు పడతాయని, అలాగే ఏ వైపున ఫోన్ పట్టుకుని మనం మాట్లాడతామో, అటువైపు చర్మంపై రేడియేషన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని లండన్ లోని లినియా స్కిన్ క్లినిక్ మెడికల్ డైరెక్టర్ సిమోన్ జోకీ తెలిపారు. ముఖ్యంగా సెల్ఫీలు ఎక్కువగా తీసుకునే వారు రేడియేషన్ బారిన పడతారని, చిన్న వయసులోనే వృద్ధాప్యఛాయలు వచ్చేలా చేస్తాయని అన్నారు. రేడియేషన్ కారణంగా ఏర్పడే చర్మ సమస్యలకు సన్ స్క్రీన్ లోషన్స్ పనిచేయవని చెప్పారు.

More Telugu News