: అందరూ కలిసి రండి...ఐఎస్ఐఎస్ ఆగడాలను అరికడదాం!: ఐక్యరాజ్యసమితి పిలుపు

పిచ్చెక్కిన కుక్కల్లా సాటి మనుషులపై దాడులకు తెగబడుతున్న ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల పీచమణిచేందుకు చేతులు కలపాలని ఐక్యరాజ్యసమితి ప్రపంచ దేశాలకు పిలుపునిస్తోంది. ఒక జాతి మొత్తాన్ని అంతమొందించాలని ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు కంకణం కట్టుకున్నారని ఐక్యరాజ్యసమితి చెబుతోంది. యాజాదీ ప్రజలు ఇస్లాంకు వ్యతిరేకులని, వారిని అంతమొందించాలని ఐసిస్ భావిస్తోందని ఐక్యరాజ్యమితి వెల్లడించింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు ఇరాక్, సిరియాల్లో 45 ఇంటర్వ్యూలు చేశారు. బాధితులు, మత పెద్దలు, ఉద్యమకారులు, వైద్య సిబ్బంది, తదితరులను ప్రశ్నించి, వివరాలు సేకరించారు. ఇస్లాం మతానికి విరోధులుగా యాజాదీలను భావించే ఐసిస్...వారిని అనేక విధాలుగా హింసిలకు గురి చేస్తోందని వారు పేర్కొన్నారు. హత్యలు, అత్యాచారాలు, సెక్స్ బానిసలుగా మార్చడం వంటి చర్యలన్నీ ఆ వ్యూహంలో భాగమేనని వివరించింది. సింజర్‌ లోని యాజాదీలను పూర్తిగా లేదా పాక్షికంగా నాశనం చేయడమే ఇస్లామిక్ స్టేట్ లక్ష్యమని, ఆ విషయం ఆ సంస్థ కార్యకలాపాల వల్ల స్పష్టమవుతోందని ఐక్యరాజ్యసమితి తెలిపింది.

More Telugu News