: జుట్టు కత్తిరించుకునేందుకు లక్ష ఖర్చు పెట్టిన ఇజ్రాయిల్ ప్రధాని

ఐరాస సమావేశాల కోసం అమెరికా వెళ్లిన ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు, అక్కడ పెట్టిన దుబారా ఖర్చుపై ఇప్పుడు విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రజా ధనాన్ని ఆయన దుర్వినియోగపరిచారని పలువురు నిప్పులు చెరుగుతున్నారు. అమెరికా వెళ్లిన ఆయన, హెయిర్ కటింగ్ కోసం లక్ష రూపాయలు వెచ్చించడంతో పాటు, దుస్తులను ఇస్త్రీ చేయించుకునేందుకు 15 వేలు, భోజనం చేసేందుకు రూ. 1.25 లక్షలు ఖర్చు చేశారని, ఐదు రోజుల ఫర్నీచర్ వాడకానికి రూ. 13 లక్షలు ఖర్చు చేశారని తెలుస్తోంది. ఈ విషయాలను సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించి, ఇజ్రాయిల్ లో సచార్ బెన్ మీర్ అనే న్యాయవాది రాబట్టారు. ప్రశ్నించిన వెంటనే తనకు సమాధానం రాలేదని, జరూసలెం కోర్టు ఆదేశాల మేరకు ఈ వివరాలను తెలుసుకున్నానని, మొత్తం రూ. 4 కోట్ల ప్రజాధనాన్ని పర్యటన పేరిట ఆయన దుబారా ఖర్చు చేశారని ఆరోపించారు.

More Telugu News