: భారత్ ఎన్ఎస్జీ సభ్యత్వానికి చైనా ఓకే!... 'ఎన్పీటీ నిబంధనలకు ఒప్పుకుంటేనే' అంటూ మెలిక!

అణు సరఫరాదారుల బృందం (ఎన్ఎస్జీ)లో సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న యత్నాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికా భారత్ సభ్యత్వానికి సంపూర్ణ మద్దతు పలికినా... రోజుకో కారణం చెబుతున్న చైనా మాత్రం మోకాలొడ్డుతోంది. అయితే నిన్న తన వాణిని మార్చిన చైనా... భారత ఎన్ఎస్జీ సభ్యత్వానికి సానుకూలత వ్యక్తం చేసినట్లు ఆ దేశ మీడియా పలు ఆసక్తికర కథనాలు రాసింది. చైనా అధికార వార్తా పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’లో ప్రచురితమైన కథనం ఆసక్తికరంగా సాగింది. ఎన్ఎస్జీలో భారత్ సభ్యత్వానికి తమకేమీ అభ్యంతరం లేదని చెబుతున్న చైనా... ఎన్పీటీ నిబంధనలను తు.చ తప్పకుండా అమలు చేస్తామని భారత్ హామీ ఇవ్వాలని మెలిక పెట్టింది. ఎన్పీటీ, సీటీబీటీ ఒప్పందాలపై సంతకం చేయని భారత్ లాంటి దేశాలకు ఎన్ఎస్జీలో సభ్యత్వం ఎందుకంటూ వాదించిన చైనా... తాజాగా తన వైఖరిని మార్చుకోవడం గమనార్హం. అంతేకాక ఎన్పీటీ నిబంధనలను అమలు చేస్తామని హామీ ఇస్తేనే ఎన్ఎస్జీలో భారత్ కు మద్దతిస్తామని ఆ దేశం కొత్త వాదనను తెరపైకి తీసుకురావడం కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

More Telugu News