ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఓర్లాండోలో ఘోరం... రెండేళ్ల చిన్నారిని లాక్కెళ్లిన మొసలి, మాసివ్ సెర్చ్ ఆపరేషన్ ఫలించేనా?

Wed, Jun 15, 2016, 12:33 PM
Related Image అమెరికాలోని ఓర్లాండోకు సమీపంలోని డిస్నీ గ్లాండ్ ఫ్లోరిడియన్ రిసార్ట్ అండ్ స్పాకు విహారం నిమిత్తం వచ్చిన ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. నెబ్రాస్కా నుంచి ఐదుగురు సభ్యులున్న ఓ కుటుంబం మంగళవారం సాయంత్రం రిసార్టుకు వచ్చి, ఇక్కడున్న ఓ సరస్సు ముందు సేదదీరుతుండగా, నీటిలోని మొసలి ఒక్కసారిగా బయటకు వచ్చి, రెండేళ్ల చిన్నారిని లాక్కెళ్లిపోయిందని ఆరంజ్ కౌంటీ షరీఫ్ జెర్రీ డెమింగ్స్ వెల్లడించారు.

ఆ వెంటనే చిన్నారి కోసం 50 మంది భద్రతాధికారులతో కూడిన బృందం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించిందని వివరించారు. ఘటన జరిగిన ఐదారు గంటల తరువాత వరకూ కూడా బాలుడి జాడ తెలియలేదు. ఈ సరస్సు వద్ద మొసళ్ల సంచారం, ఈ తరహా దాడులపై ఇటీవలి కాలంలో ఫిర్యాదులేవీ రాలేదని, చిన్నారిని మొసలి లాక్కెళుతుంటే, రక్షించేందుకు అతని తండ్రి చేసిన ప్రయత్నాలు ఫలించలేదని డెమింగ్స్ తెలిపారు. కాగా, బాలుడు ప్రాణాలతో ఉండే అవకాశాలు ఎంతమాత్రమూ లేవని తెలుస్తోంది.
X

Feedback Form

Your IP address: 54.159.129.152
Articles (Latest)
Articles (Education)