: వన్డే కెరీర్ పట్ల సంతోషంగా ఉన్నాను: రాయుడు

వన్డే కెరీర్ పట్ల టీమిండియా ఆటగాడు అంబటి రాయుడు ఆనందంగా ఉన్నాడు. తెలుగు క్రికెట్ సంఘాల తరపున ఆడినన్నాళ్లు రంజీల్లో చోటుకోసం నానా ఇబ్బందులుపడ్డ రాయుడు, జట్టు మారిన తరువాత ఫేట్ మార్చుకున్నాడు. అయితే, టీమిండియాలో నైపుణ్యమున్న ఆటగాడిగా పేరు సంపాదించుకున్నప్పటికీ స్థిరంగా స్థానం మాత్రం సంపాదించుకోలేకపోతున్నాడు. ద్వితీయ శ్రేణి జట్టు అయితే కచ్చితమైన స్థానాన్ని పొందుతున్న రాయుడు, సీనియర్ జట్టులో స్థానం దక్కించుకున్నప్పటికీ, అవకాశం లేని ఆటగాడిగా మాత్రం మిగిలిపోతున్నాడు. అయితే అందరికీ అవకాశాలు ఒకేసారి రావని చెబుతున్న రాయుడు, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నానని తెలిపాడు. ప్రాక్టీస్ మ్యాచ్ అయినా, జట్టు ఏదయినా తన సన్నాహాల్లో ఎలాంటి మార్పు ఉండదని రాయుడు చెప్పాడు. గతం గురించి ఆలోచించకుండా బాగా ఆడడం గురించే ఆలోచిస్తానని అన్నాడు. కాగా, టీమిండియాలోని వన్డేల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన ఆటగాళ్లలో మూడో వాడిగా రాయుడు రికార్డుల్లోకి ఎక్కాడు. కేవలం 29 వన్డేల్లోనే రాయుడు వెయ్యి పరుగుల మైలు రాయి చేరుకున్నాడు.

More Telugu News