ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

డొనాల్డ్ ట్రంప్ చేసిన అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలివిగో!

Tue, Jun 14, 2016, 12:30 PM
Related Image రిపబ్లికన్ల తరఫున అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ కు ఎంతటి నోటి దురుసు ఉందో అందరికీ తెలిసిందే. ఎక్కడ మాట్లాడినా, ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా ఆయన నోటి నుంచి ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్య వచ్చే తీరుతుంది. ఆయన పార్టీ వారే నిర్ఘాంతపోయే వ్యాఖ్యలను ఎన్నింటినో ఆయన చేశారు. ఈ నేపథ్యంలో ట్రంప్ నోటి నుంచి వచ్చిన అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలివి.

* ఇవాంకా నా కుమార్తె కాకపోయి ఉంటే, నేను డేటింగ్ చేసి ఉండేవాడిని.
* నా చేతి వేళ్లు చాలా అందంగా ఉంటాయి. శరీరంలోని ఇతర భాగాలూ అంతే బాగుంటాయి.
* డైట్ కోక్ ను తాగుతున్న బక్క పలచటి వ్యక్తిని ఇంతవరకూ నేను చూడలేదు.
* ఒబామా పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం నకిలీది. ఈ విషయం అత్యంత నమ్మకమైన వర్గాల ద్వారా నాకు తెలిసింది.
* అరియానా హఫింగ్టన్ (హఫింగ్టన్ పోస్ట్ ఎడిటర్ - ఇన్ - చీఫ్) అందంగా ఉండదు. బాహ్య, అంతఃసౌందర్యాల విషయంలో... ఆమె భర్త ఎందుకు వదిలేసి వెళ్లిపోయాడో నాకు తెలుసు. అతను మంచి నిర్ణయం తీసుకున్నాడు.
* నేను అధికారంలోకి వస్తే, దక్షిణాన మెక్సికోను వేరు చేస్తూ, అతిపెద్ద వాల్ ను నిర్మిస్తాను. దాని నిర్మాణ ఖర్చును మెక్సికో నుంచే లాగుతా.
* మెక్సికో తన దేశస్తులను అమెరికాకు పంపుతోంది. వారు మంచి వారు కాదు. ఇక్కడ సమస్యలు సృష్టిస్తున్నారు. మాదక ద్రవ్యాలు తెస్తున్నారు. అదో పెద్ద నేరం. వారు రేపిస్టులు.
* నేనే గనుక 'ది వ్యూ' (ఓ టెలివిజన్ షో) నిర్వహించే పక్షంలో యాంకర్ రోజీ ఓ డొనీల్ ను తక్షణం తీసేస్తా. అంత లావుగా, చూడటానికి అసహ్యంగా ఉండే ముఖంతో కనిపించే ఆమె ఎదురుగానే 'రోజీ నిన్ను తీసేస్తున్నా' అని చెప్పేస్తాను.
* 'అప్రెంటీస్'లో పాల్గొన్న యువతులంతా తెలిసో, తెలియకో నాకు లైన్ వేయడానికి ప్రయత్నించారు. (అప్రెంటీస్ - ఓ అమెరికన్ రియాల్టీ షేమ్ షో. ఇందులో కంటెస్టెంట్ల వ్యాపార నైపుణ్యాన్ని పరిశీలిస్తారు. గెలుపొందిన వారికి ట్రంప్ కంపెనీల్లో పనిచేసే అవకాశం లభిస్తుంది)
* ఓ సెక్సీ గర్ల్ ఫ్రెండ్ పక్కనున్నంత సేపు ఏం జరిగినా ఫర్వాలేదు.
* ప్రపంచంలోని ఏ ఒక్క ముస్లింను యూఎస్ లోకి ప్రవేశించకుండా నిషేధం విధిస్తాను.
* నాకు ఎంతో మంది గే స్నేహితులు ఉన్నారు. నేను మాత్రం సంప్రదాయవాదినే.
* అమె కళ్లు రక్తాన్ని వర్షిస్తున్నాయిప్పుడు. ఇంకో చోట నుంచి కూడా రక్తం కారుతుంది. (ఫాక్స్ న్యూస్ యాంకర్ మెగన్ కెల్లీ ఓ ఇంటర్వ్యూలో కఠినమైన ప్రశ్నలను అడుగుతున్న వేళ ట్రంప్ చేసిన వల్గర్ కామెంట్)
X

Feedback Form

Your IP address: 54.197.150.143
Articles (Latest)
Articles (Education)