ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఐఎస్ చీఫ్ అబూ బకర్ ఆల్ బాగ్దాదీ హతం

Tue, Jun 14, 2016, 11:06 AM
Related Image ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) కు దెబ్బల మీద దెబ్బలు తగులుతున్నాయి. మొన్న (ఆదివారం) ఇరాక్- సిరియా సరిహద్దులో అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనలు చేసిన వైమానిక దాడుల్లో ఐఎస్ చీఫ్ అబూ బకర్ ఆల్ బాగ్దాదీ తీవ్రంగా గాయపడినట్టు వార్తలు వినిపించాయి. అయితే ఈ దాడుల్లో అతడు చనిపోయాడని నేటి ఉదయం వార్తా కథనాలు వెల్లువలా వచ్చాయి. ఈ వార్తలను సంకీర్ణ సేనలు ధ్రువీకరించనప్పటికీ అమెరికా రక్షణ శాఖ వర్గాలను ఉటంకిస్తూ అమెరికా టీవీ నెట్ వర్క్ ‘సీఎన్ఎన్’ బాగ్దాదీ చనిపోయినట్లు తెలిపింది. బాగ్దాదీ చనిపోయినట్లు తమకు విశ్వసనీయ వర్గాలు తెలిపాయని ఆ వర్గాలు చెప్పినట్లు సీఎన్ఎన్ పేర్కొంది.
X

Feedback Form

Your IP address: 54.205.150.215
Articles (Latest)
Articles (Education)