ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఇద్దరు మగాళ్ల ‘లిప్ లాక్’ మతీన్ కు నచ్చలేదు... ఓర్లాండో నరమేధానికి కారణమిదేనా?

Mon, Jun 13, 2016, 11:44 AM
Related Image అమెరికాను తన దుశ్చర్యతో వణికించిన ఒమర్ మతీన్... అసలు ఆ దుశ్చర్యకు పాల్పడిన కారణం వింటే ఆశ్చర్యం వేయక మానదు. ఇద్దరు మగాళ్లు బహిరంగంగా ముద్దు పెట్టుకున్న ఓ ఘటన, స్వలింగ సంపర్కంపై తీవ్ర వ్యతిరేక భావనలున్న మతీన్ ను తీవ్ర ఆగ్రహావేశాలకు గురి చేసిందట. ఈ క్రమంలోనే అతడు ఫ్లోరిడాలోని ఓర్లాండో ‘గే’ క్లబ్ లక్ష్యంగా నరమేధం సృష్టించాడు. ఈ మేరకు మతీన్ తండ్రి మిర్ సిద్ధిఖ్ దాడి తర్వాత స్పందించిన సందర్భంగా ఈ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇటీవలే మియామీ బీచ్ కు వెళ్లిన సందర్భంగా ఇద్దరు మగాళ్లు బహిరంగంగా ముద్దుపెట్టుకుంటున్న వైనం చూసి మతీన్ ఆగ్రహానికి గురయ్యాడని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో గే క్లబ్ పై మతీన్ దాడి చేసి ఉంటాడని కూడా సిద్ధిఖ్ తెలిపారు. తన కొడుకు చేసిన ఈ దాడిని ఖండించిన సిద్ధిఖ్... ఘటనను మతపరమైన అంశంగా పరిగణించవద్దని కూడా ఆయన పేర్కొనడం గమనార్హం.
X

Feedback Form

Your IP address: 54.163.129.96
Articles (Latest)
Articles (Education)